దుబాయ్ ట్రామ్ వయొలేషన్స్‌కి కొత్త జరీమానాలు
- October 04, 2016
దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఛైర్మన్ షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషిద్ అల్ మక్తౌమ్, కౌన్సిల్ రిజల్యూషన్ నెం.51 - 2016, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ రిజల్యూషన్ నెం.1-2016 అమెండ్‌మెంట్‌లను జారీ చేశారు. ట్రామ్ సిస్టమ్‌కి సంబంధించి ఈ రెండు రిజల్యూషన్స్‌ని విడుదల చేయడం జరిగింది. ఈ కొత్త రిజల్యూషన్స్ ప్రకారం, ట్రామ్‌వే ఇంటర్‌సెక్షన్ల వద్ద నిబంధనల్ని ఉల్లంఘించినవారికి భారీ జరీమానాలు విధిస్తారు. మినిమమ్ జరీమానా 15,000 దిర్హామ్‌ల నుంచి, మేగ్జిమమ్ 30,000 దిర్హామ్ వరకూ జరీమానా ఉంటుంది. అలాగే డ్రైవర్ లైసెన్స్‌ని ఏడాది నుంచి మూడేళ్ళపాటు రద్దు చేయడం కూడా జరుగుతుంది. ట్రామ్ వే ఇంటర్‌సెక్షన్ వద్ద రెడ్‌లైట్‌ని జంప్ చేసి, ప్రమాదానికి కారకులైతే 5,000 నుంచి 15,000 దిర్హామ్‌ల వరకు జరీమానా, 6 నుంచి 12 నెలలపాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారు. ప్రమాదం జరగకుండా జంపింగ్ ఎడ్ సిగ్నల్‌కి 2,000 నుంచి 5000 దిర్హామ్‌ల వరకు జరీమానా, 30 రోజుల నుంచి 3 నెలలపాటు లైసెన్స్ రద్దు చేస్తారు. ఇవి కాకుండా ఓనర్స్, కాంట్రాక్టర్స్ లేదా ఆపరేటర్స్‌కి సంబంధించిన వర్క్‌ని ఆర్‌టిఎ సస్పెండ్ చేసే అవకాశం కూడా ఉంది. గెజిట్‌లో రిజల్యూషన్ పబ్లిష్ అయినప్పటినుంచీ ఈ కొత్త జరీమానాలు అమల్లోకి వస్తాయి.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







