బంజరాహిల్స్‌లోని అలయెన్స్ ఫ్రాంచైజ్‌లో యానిమేషన్ ఫిల్మ్ ఫెస్టివల్
- October 04, 2016
యానిమేటెడ్ ఫిల్మ్స్‌ని ప్రపంచానికి పరిచయం చేసే ఉద్దేశంతో యానిమేషన్ ఫిల్మ్ ఫెస్టివల్‌ని నిర్వహిస్తున్నారు. ఆరంభంలో ఫ్రాన్స్‌లోని వేరువేరు నగరాల్లో ఈ చిత్ర ప్రదర్శన నిర్వహించేవారు. క్రమంగా దీనిని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేశారు. అందులోభాగంగానే హైదరాబాద్ లోని బంజరాహిల్స్‌లోని అలయెన్స్ ఫ్రాంచైజ్‌లో యానిమేషన్ ఫిల్మ్ ఫెస్టివల్‌ని నిర్వహిస్తున్నారు. సిమోన్ రోబీ దర్శకత్వం వహించిన అదామా (85నిమిషాలు) చిత్రంతో ఫెస్టివల్‌ని ప్రారంభించనున్నారు. ఫిల్మ్ ఫెస్టివల్ 15 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఐదు లఘు చిత్రాలు ప్రదర్శించన్నురు. ఫ్రెంచ్ ఆర్ట్ మోడల్, సింగర్, నటీమణి జీవితంపై రూపొందించిన మడేమోయిసెల్లె కికి ఎట్ ఎల్‌స్ చిత్రా న్ని కూడా ప్రదర్శిస్తుండడం గమనార్హం.ఫెస్టివల్‌లో భాగంగా గోబెలిన్ ఎల్ ఎకోల్ దే ఎల్ ఇమేజ్ విద్యార్థులు రూపొందించిన యానిమేటెడ్ లఘు చిత్రాలను ప్రదర్శించనున్నారు. వీటిని పిల్లల కోసం 19న సాయంత్రం 5:30 గంటలకు, పెద్దలకు 6:45 నిమిషాలకు ప్రదర్శించనున్నారు. వీటిలో పలు అవార్డ్ విన్నింగ్ చిత్రాలు సైతం ఉన్నాయి. అక్టోబర్ 26న ఫొలిమేజ్ స్టూడియోస్ రూపొందిచిన లఘుచిత్రాలను ప్రద్శర్శించనున్నారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









