దెయిరా సముద్రపాయలో మునిగిన కారు నుంచి వ్యక్తిని రక్షించిన పోలీసులు
- October 05, 2016
తన కారుతో సహా డెయిరి సముద్ర పాయలో మునిగిపోయి తీవ్రంగా గాయపడిన ఒక వ్యక్తిని రక్షించినట్లు దుబాయ్ పోలీసులు మంగళవారం తెలిపారు. దుబాయ్ క్లబ్ బ్రిగేడ్ సమీపంలో మంగళవారం జరిగిన మరోక ప్రమాదంలో ఒక ట్యాంకర్ మరియు భారీ ట్రక్ షార్జా సమీపంలో ఒక దానినొకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో గాయపడిన ట్యాంకర్ డ్రైవర్ తన వాహనాన్ని వదిలి పారిపోయినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. ఈ ప్రమాదంకు కారకుడైన డ్రైవర్ వాహనం లోపల ఇరుక్కుపోయాడు. దీనితో ప్రమాదాల నుంచి రక్షించే జట్టు హైడ్రాలిక్ యంత్రం ఉపయోగించి వాహన లోపల భాగాలను కత్తిరించి ఆ డ్రైవర్ ను కాపాడవల్సివచ్చింది. అనంతరం బాధితుడిని హెలికాఫ్టర్ ద్వారా రషీద్ హాస్పిటల్ కు తరలించారు.దుబాయ్ పోలీస్ భూ ఉపరితల రక్షక జట్టు విభాగానికి అధిపతి మేజర్ అబ్దుల్లా బిషోఆహ్ మాట్లాడుతూ , తమకు ఉదయం 9:30 గంటలకు ఒక సమాచారం అందుకున్నట్లు తెలియచేస్తూ వెనువెంటనే దుబాయ్ పోలీస్ 8 నిమిషాల్లో అక్కడకు వచ్చినట్లు చెప్పారు.దుబాయ్ సివిల్ డిఫెన్స్ జట్టు, దుబాయ్ పోలీస్ వైమానిక సిబ్బంది మరియు అంబులెన్సులు కూడా ఆ సమయంలో సమయంలో సంఘటనా స్థలానికి వచ్చాయి .
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







