వలసదారుల తొక్కిసలాట, 32 మంది మృతి

- October 05, 2016 , by Maagulf
వలసదారుల తొక్కిసలాట, 32 మంది మృతి

ప్రాణాలు అరచేతబెట్టుకుని ఐరోపాలో ఎలాగో బతుకుదామనుకుని భారీసంఖ్యలో పలుడింగీల్లో వలసబోతున్న వారిలో కనీసం 32 మంది తొక్కిసలాటలో మరణించారు. డింగీలు, చెక్కపడవలో కలిపి భారీ సంఖ్యలో జనం ఉన్నట్లు ఒక అంచనా అని ఇటాలియన్‌ తీర రక్షక దళం వర్గాలు వెల్లడించాయి. లిబియా ఉత్తర భాగాన అంతర్జాతీయ జలాల్లో ఈ దళం సహాయక చర్యలు చేపడుతోంది. ఇదిలా ఉంటే...చిన్నచిన్న పడవల్లో వలసబోతూ సముద్రజలాల్లో చిక్కుపడిపోయే వారిని రక్షించేందుకు స్పెయిన్‌కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన 'ఆస్ట్రల్‌'లో ఉన్న ఫొటోగ్రాఫర్‌ ఒకరు బుధవారం ఈ విషయాన్ని వెల్లడించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com