నియంత్రణ రేఖ దాటి భారత్‌లోకి చొరబడేందుకు 100 మంది మిలిటెంట్లను సిద్ధం..

- October 05, 2016 , by Maagulf
నియంత్రణ రేఖ దాటి భారత్‌లోకి చొరబడేందుకు 100 మంది మిలిటెంట్లను సిద్ధం..

 సర్జికల్ దాడులకు ప్రతీకారంగా భారత ఆర్మీపై, వివిధ ప్రాంతాల్లో దాడులు చేసేందుకు పాక్ ప్రయత్నిస్తోందని.. నియంత్రణ రేఖ దాటి భారత్‌లోకి చొరబడేందుకు 100 మంది మిలిటెంట్లను సిద్ధం చేసిందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తెలిపారు. ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఎస్) భేటీలో ఈ విషయాన్ని వెల్లడించారు. సర్జికల్ దాడుల తర్వాత ఎల్వోసీలో ఉగ్ర శిబిరాలకు పాక్ సైనికులు కాపలా కాస్తున్నారని.. అలాంటి 12 శిబిరాలను గుర్తించామన్నారు. 
శీతాకాలం లోపే వీలైనంత ఎక్కువ చొరబాట్లకు పాక్ యోచిస్తోందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com