2 మిలియన్లు దాటిన ఖతార్‌ విజిటర్స్‌

- October 05, 2016 , by Maagulf
2 మిలియన్లు దాటిన ఖతార్‌ విజిటర్స్‌



ఖతార్‌: ఈ ఏడాది ఇప్పటిదాకా ఖతార్‌ని సందర్శించినవారి సంఖ్య 2.182 మిలియన్లకు చేరుకుందని ఖతార్‌ టూరిజం అథారిటీ (క్యుటిఎ) వర్గాలు వెల్లడించాయి. సెప్టెంబర్‌లో జిసిసి దేశాలకు చెందినవారు ఎక్కువగా ఖతార్‌ని విజిట్‌ చేసినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2015తో పోల్చితే సౌదీ అరేబియా, యూఏఈలనుంచి వచ్చినవారి సంఖ్య 8 శాతం, 17 శాతం పెరుగుదల నమోదయ్యింది. బహ్రెయిన్‌, కువైట్‌ నుంచి వచ్చిన వారి శాతం 3 మరియు 2 అధికంగా ఉంది. ఒమన్‌ నుంచి వచ్చినవారి సంఖ్యలో మాత్రం 5 శాతం తగ్గుదల నమోదయ్యింది. జిసిసి రీజియన్‌ నుంచి వచ్చినవారి సంఖ్య 7 శాతం పెరుగుదల నమోదు చేసింది. సెప్టెంబర్‌లో కేవలం సౌదీ నుంచి వచ్చినవారి సంఖ్య 100,000గా ఉంది. ఖతార్‌ తొలిసారిగా క్రూయిజ్‌ షిప్‌ని అక్టోబర్‌ 18న 45 దేశాలకు చెందిన టూరిస్టుల్ని ఆహ్వానించనుంది. క్యుటిఎ ముందు ముందు మరింతగా విజిటర్స్‌ని ఆకర్షించేందుకు సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేయనుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com