సైనికుల కోసం బాలీవుడ్ మెగాస్టార్ పాట
- October 06, 2016
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సైనికుల కోసం పాట పాడనున్నారు. ఇటీవల ఉరీలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో అమరులైన సైనికులకు ఈ పాటను అంకితం చేయనున్నారు. సైనికుల కోసం అమితాబ్‌ను పాట పాడమని కోరినట్లు బీజేపీ ఎంపీ తరుణ్ విజయ్ తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా తెలిపారు. 'అమితాబ్ బచ్చన్‌ను కలిశాను. మన నిజమైన జాతీయ హీరోను కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఆయన హనుమాన్ చాలీసా, కేదార్‌నాథ్ అర్చనతోపాటు సిద్ధి వినాయక్ హారతిని ఆలపించారు. సైనిక వీరుల కోసం కూడా తన స్వరం అందించమని కోరాము' అని తరుణ్ విజయ్ పోస్ట్ చేశారు. బిగ్ బి ఈ ఏడాది ప్రారంభంలో ఇండియా-పాకిస్థాన్ టీ-20 ప్రపంచ కప్ సమయంలో జాతీయగీతం పాడిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- కమ్యూనిటీ వర్చువల్ సమావేశం నిర్వహించిన భారత రాయబారి..!!
- అత్యవసర హెచ్చరికలు.. ప్రజలకు సౌదీ అరేబియా అప్పీల్..!!
- ఒమన్‌లో CBSE విద్యార్థుల పై పరీక్షల ఒత్తిడి..!!
- మిడిలీస్టు సంక్షోభం.. 40వేలకు పైగా ఫ్లైట్స్ క్యాన్సిల్..!!
- వివిధ ప్రదేశాలలో ఈదియా ATMలు ప్రారంభం..!!
- రాజద్రోహం కేసులో మరణశిక్షకు ప్రాసిక్యూషన్ పిలుపు..!!
- భారత జట్టు తదుపరి మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే..!
- బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్
- ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా దుబాయ్–వరుసగా ఆరవ సంవత్సరం గుర్తింపు
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..









