పాక్ లో విమానాన్ని దింపితే అదే మనకు చివరి గమ్యం...
- October 06, 2016
పాకిస్థాన్ లో అత్యవసరంగా విమానాలు కిందకు దించే పరిస్థితి రాకుండా చూసుకోవాలని పైలట్లకు ఇండియన్ ఎయిర్ లైన్స్ సూచించింది. దాయాది దేశంలో విమానం దించితే అదే మనకు తుది గమ్యం అవుతుందని హెచ్చరించింది. భారత సైన్యం మెరుపు దాడులు చేసిన నేపథ్యంలో తమ భూభాగంలోని గగనతలంపై పాకిస్థాన్ ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మీదుగా రాకపోకలు సాగించే విమానాల పైలట్లకు ఎయిర్ ఇండియా పలు జాగ్రత్తలు సూచించింది.
'పాకిస్థాన్ విమానాశ్రయాల్లో అత్యవసరంగా విమానం కిందకు దించే పరిస్థితి రాకుండా చూసుకోండి. విమానంలో మంటలు వ్యాపించడం లాంటి తీవ్ర అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే దీనికి మినహాయింపు ఉంటుంది.
పాక్ లో విమానాన్ని దింపితే అదే మనకు చివరి గమ్యం కావొచ్చ'ని ఇండియన్ ఎయిర్ లైన్స్ పేర్కొందని సీనియర్ పైలట్ ఒకరు వెల్లడించారు. అయితే మౌఖికంగా మాత్రమే ఈ సూచనలు చేసిందని చెప్పారు.
గతంలోనూ ఇలాంటి సూచనలు చేసిందని సీనియర్ కమాండర్ ఒకరు తెలిపారు. కాందహార్ హైజాకింగ్, 9/11, 26/11 దాడులు జరినప్పుడు కూడా ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నారని గుర్తు చేశారు. ఉత్తరమధ్య, తూర్పు ఇండియా నుంచి వెళ్లే విమానాలన్నీ పాకిస్థాన్ మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. అమెరికా, యూరోప్, గల్ఫ్ దేశాల నుంచి వచ్చే విమానాలు కూడా పాక్ మీదుగా మన దేశానికి వస్తుంటాయి.
తాజా వార్తలు
- కువైట్‌లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్‌కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్‌లో ఉద్యోగాలు..









