' రామకృష్ణ' మల్టీస్టారర్ మూవీ టైటిల్...
- October 07, 2016
తెలుగు సినీ అభిమానులలో మెగా ఫ్యామిలీతో పాటు, నందమూరి ఫ్యామిలీకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ ఫ్యామిలీ హీరోలతో ఎ.ఎస్.రవి కుమార్ చౌదరి ఓ మల్టీ స్టారర్ సినిమా తెరకెక్కించనున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. కె.ఎస్. రామారావు నిర్మాణంలో రూపొందనున్న ఈ చిత్రానికి తాజాగా టైటిల్ ఫిక్స్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది .' రామకృష్ణ' అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన త్రిష నటించనుండగా, సాయిధరమ్ సరసన రెజీనా హీరోయిన్ గా నటించనున్నట్టు సమాచారం. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుందట. కళ్యాణ్ రామ్ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఇజం చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉండగా, సాయిధరమ్ తేజ్, గోపిచంద్ మలినేని చిత్రీకరిస్తున్న మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు.
తాజా వార్తలు
- కువైట్‌లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్‌కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్‌లో ఉద్యోగాలు..









