తగ్గిన బంగారం, వెండి ధరలు

- October 07, 2016 , by Maagulf
తగ్గిన బంగారం, వెండి ధరలు

అంతర్జాతీయంగా డిమాండ్‌ లేమితో నేటి బులియన్‌ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరింత తగ్గాయి. పది గ్రాముల పసిడి ధర రూ.170 తగ్గి రూ.30,320కి చేరింది. అలాగే వెండి ధర కూడా భారీగానే తగ్గింది. కిలో వెండి ధర రూ.920 తగ్గి రూ.41,930కి పడిపోయింది. వెండికి పారిశ్రామికవర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కూడా డిమాండ్‌ తగ్గినట్లు బులియన్‌ వర్గాలు చెబుతున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. సింగపూర్‌ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1254.40డాలర్లు కాగా, ఔన్సు వెండి ధర 17.27డాలర్లుగా ఉంది. .

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com