అమెరికాలోని అత్యంత సంపన్నుల జాబితాలో భారత సంతతి..

- October 09, 2016 , by Maagulf
అమెరికాలోని అత్యంత సంపన్నుల జాబితాలో భారత సంతతి..

అమెరికాలోని అత్యంత సంపన్నుల జాబితాలో భారత సంతతికి చెందిన ఐదుగురికి చోటు దక్కింది. ప్రముఖ ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ అమెరికాలోని 400మంది సంపన్నుల జాబితాను విడుదల చేసింది. మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ వరుసగా 23వ ఏడాది తొలిస్థానంలో నిలిచారు.భారత సంతతికి చెందిన సింఫనీ టెక్నాలజీ వ్యవస్థాపకులు రోమేష్‌ వద్వానీ, ఔట్‌సోర్సింగ్‌ సంస్థ సింటెల్‌ సహ వ్యవస్థాపకులు భరత్‌ నీర్జా దేశాయ్‌, ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సహ వ్యవస్థాపకులు రాకేష్‌ గంగ్వాల్‌, పారిశ్రామికవేత్త జాన్‌ కపూర్‌, సిలికాన్‌ వ్యాలీకి చెందిన కవితారక్‌ రామ్‌ శ్రీరామ్‌లు 2016 సంవత్సరానికిగానూ అమెరికాలోని సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకున్నారు.60ఏళ్ల బిల్‌గేట్స్‌ 81 బిలియన్‌ డాలర్ల సంపదతో మొదటిస్థానంలో నిలిచారు. సేవాతత్పరతో కూడా ఆయనే ముందున్నారు. బిల్‌ అండ్‌ మిలిందా ఫౌండేషన్‌ ద్వారా పోలియో నిర్మూలన, మలేరియాను పారద్రోలడం తదితర ఎన్నో సేవా కార్యక్రమాలను ఫౌండేషన్‌ ద్వారా చేస్తున్నారు.ఫోర్బ్స్‌ వెలువరించిన జాబితాలో 3 బిలియన్‌ డాలర్లతో వాద్వానీ 222 స్థానంలో ఉండగా, 2.5 బిలియన్‌ డాలర్ల సంపదతో రొమేష్‌ దేశాయ్‌(274), 2.2 బిలియన్‌ డాలర్లతో గంగ్వాల్‌(321), 2.1 బిలియన్‌ డాలర్లతో కపూర్‌(335) తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఇక శ్రీరామ్‌ 1.9 బిలియన్‌ డాలర్లతో 361 స్థానాన్ని దక్కించుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com