అమెరికాలోని అత్యంత సంపన్నుల జాబితాలో భారత సంతతి..
- October 09, 2016
అమెరికాలోని అత్యంత సంపన్నుల జాబితాలో భారత సంతతికి చెందిన ఐదుగురికి చోటు దక్కింది. ప్రముఖ ఫోర్బ్స్ మ్యాగజైన్ అమెరికాలోని 400మంది సంపన్నుల జాబితాను విడుదల చేసింది. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ వరుసగా 23వ ఏడాది తొలిస్థానంలో నిలిచారు.భారత సంతతికి చెందిన సింఫనీ టెక్నాలజీ వ్యవస్థాపకులు రోమేష్ వద్వానీ, ఔట్సోర్సింగ్ సంస్థ సింటెల్ సహ వ్యవస్థాపకులు భరత్ నీర్జా దేశాయ్, ఇండిగో ఎయిర్‌లైన్స్ సహ వ్యవస్థాపకులు రాకేష్ గంగ్వాల్, పారిశ్రామికవేత్త జాన్ కపూర్, సిలికాన్ వ్యాలీకి చెందిన కవితారక్ రామ్ శ్రీరామ్‌లు 2016 సంవత్సరానికిగానూ అమెరికాలోని సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకున్నారు.60ఏళ్ల బిల్‌గేట్స్ 81 బిలియన్ డాలర్ల సంపదతో మొదటిస్థానంలో నిలిచారు. సేవాతత్పరతో కూడా ఆయనే ముందున్నారు. బిల్ అండ్ మిలిందా ఫౌండేషన్ ద్వారా పోలియో నిర్మూలన, మలేరియాను పారద్రోలడం తదితర ఎన్నో సేవా కార్యక్రమాలను ఫౌండేషన్ ద్వారా చేస్తున్నారు.ఫోర్బ్స్ వెలువరించిన జాబితాలో 3 బిలియన్ డాలర్లతో వాద్వానీ 222 స్థానంలో ఉండగా, 2.5 బిలియన్ డాలర్ల సంపదతో రొమేష్ దేశాయ్(274), 2.2 బిలియన్ డాలర్లతో గంగ్వాల్(321), 2.1 బిలియన్ డాలర్లతో కపూర్(335) తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఇక శ్రీరామ్ 1.9 బిలియన్ డాలర్లతో 361 స్థానాన్ని దక్కించుకున్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







