టర్కీలో కారు బాంబుపేలుడు 6 సైనికులు మృతి
- October 09, 2016
తీవ్రవాదులు కారుబాంబు పేల్చడంతోటర్కీలో ఆరుగురు సైనికులు మరణించారు. నిఘావర్గాల సమాచారం ప్రకారం.. టర్కీకి ఆగ్నేయ సరిహద్దులో ఉన్న పోలీస్‌స్టేషన్‌లో ఈ పేలుడు సంభవించింది. సెమ్డిన్లి నగరానికి సమీపంలోని డ్యూరాక్ జండ్మండరీ స్టేషన్లో ఈ ప్రమాదం సంభవించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ ప్రాంతం ఇరాక్, ఇరాన్‌లకు సరిహద్దులో ఉంది. కుర్దిస్టన్ వర్కర్స్ పార్టీ(పీకేకే) తీవ్రవాదులు ఈ సరిహద్దులో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. వాహన తనీఖీలు నిర్వహిస్తున్న సమయంలో పేలుడు సంభవించినట్లు ఓ న్యూస్ఏజెన్సీ పేర్కొంది. పలు ఉగ్రవాద సంస్థల ప్రోత్సాహంతో 1984లో పీకేకే ఏర్పాటైంది.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







