పాప్ కార్న్ వలన ఆరోగ్యానికి కలిగే ప్రమాదాలు..

- October 11, 2016 , by Maagulf
పాప్ కార్న్  వలన ఆరోగ్యానికి కలిగే ప్రమాదాలు..

సినిమా హాల్, బస్టాప్ లేదా ఇతర రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్ళగానే మైక్రోవేవ్ లో చేసే పాప్కాన్ వాసన మన ముక్కును తాకగానే నోరు ఊరుతుంది. కానీ ఇలా మైక్రోవేవ్ లో తయారు చేసే పాప్కాన్ ఆరోగ్యానికి మంచిది కాదు. ఆసక్తిని పెంచే ఈ పాప్కాన్ లలో వాసన వచ్చే విధంగా కృత్రిమ బటర్ రసాయలను కలుపుతారు, దీనిని "డైఅసిటైల్" ను అంటారు. ఇది పాప్కాన్ కు మంచి రుచి చేకూరుస్తుంది. ఇంత రుచిగా ఉండే ఈ పాప్కాన్ మన ఆరోగ్యానికి ఎలా హానికరమని మీరు ఆలోచిస్తుండొచ్చు. "డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్" వారు పరిశోధనలు జరిపి, ప్రచురించిన దాని ప్రకారం, రసాయనాలు కలపటం వలన పాప్కాన్ నుండి వెలువడే ఈ వాసన ఊపిరితిత్తులలో ప్రమాదానికి గురి చేస్తుంది, దీనినే సాధారణంగా 'పాప్కాన్ లంగ్' అంటారు.


"డైఅసిటైల్" అనే సమ్మేళనం తినటం వలన ఎలాంటి సమస్యలు కలగవు కానీ, దీనిని అధిక ఉష్ణోగ్రతల వద్ద వేడి చేసేపుడు వచ్చే వాసన మరియు ఈ సమ్మేళనం చాలా ప్రమాదకరం అని పరిశోధనలలో తెలుపబడింది.
పాప్కాన్ పరిశ్రమలలో ఏమ్ జరుగుతుంది?
"నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్" వారు పప్కాన్ పరిశ్రమలలో పని చేసే వారిపై దర్యాప్తు జరిపి, వారిలో "బ్రాన్కైలిటిస్ ఓబ్లిటెరాన్స్" అనే వ్యాధికి గురవుతున్నారని తెలిపింది. శ్వాస గొట్టాలపై ఒత్తిడి కలిగించి, గాలి ప్రసరణకు అడ్డంకులు ఏర్పరిచే ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధిగా దీనిని పేర్కొనవచ్చు. ఈ దర్యాప్తు ఫలితంగా, 2,3-బ్యూటైన్డయోన్ లేదా "డైఅసిటైల్" వంటి కృత్రిమ సమ్మేళనాలకు బహిర్గతం అవటం వలన ఈ వ్యాధి కలుగుతుంది.

రసాయనం ప్రయోజనాలు
"డైఅసిటైల్" రసాయనం మాత్రమేకాకుండా, పాప్కాన్ పాకెట్ తయారు చేయుటకు "పర్ ఫ్లూరోఅల్కైల్", "పర్ ఫ్లూరో ఆక్టానోయిక్ ఆసిడ్" మరియు "పర్ ఫ్లూరో ఆక్టానోయిక్ సల్ఫోనేట్ వంటి రసాయన సమ్మేలనాలను వాడతారు. ఈ రసాయనాలతో చేసిన పాకెట్ లో పాప్కాన్ నానబెట్టబడుతుంది. ఇలా వీటిని వేడి చేసి, పాప్కాన్ ను తినటం వలన పైన పేర్కొన్న రసాయనాలు మన ఎండోక్రైన్ వ్యవస్థలో ఆటు-పోటులను కలిగించి, థైరాయిడ్ సమస్యలను పెంచి, కేన్సర్ వంటి ప్రమాదకార వ్యాధులను కలిగిస్తుంది.

పరిశోధనలు ఏమ్ చెప్తున్నాయి?
"యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటా" వారిచే జరుపబడిన రసాయనిక పరిశోధనల ప్రకారం, మైక్రోవేవ లో తయారుచేసే పాప్కాన్ లో కలిపే "డైఅసిటైల్" రసాయనానికి, మెదడు ప్రోటీన్ మరియు అల్జీమర్స్ వ్యాధి మధ్య సంబంధాన్ని కనుగొన్నారు. అంతేకాకుండా, "డైఅసిటైల్" సమ్మేళనం అల్జీమర్స్ వ్యాధిని కలిగిస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కానీ, ఈ రసాయనం బ్లడ్-బ్రెయిన్ బారియర్ నుండి ప్రసరిస్తుందని వారు తెలిపారు.

మీరేం చేయాలి?
ఇలాంటి రసాయనిక సమ్మేళనాలను కనుగొనే పాప్కాన్ కి బదులుగా ఇంట్లోనే స్వతహాగా తయారు చేసుకున్న పాప్కాన్ తినటం ఆరోగ్యకరం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com