దివ్యాంగులు షిర్డీ సాయి దర్శనానికి క్యూ పద్ధతిని పాటించక్కర్లేదు...
- October 12, 2016
సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు షిర్డీ సాయి దర్శనానికి క్యూ పద్ధతిని పాటించక్కర్లేదు. వారితో పాటు ఏడాది లోపు చిన్నారులున్న మహిళలకు నేరుగా దర్శనం కల్పించాలని నిర్ణయించినట్టు సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ చైర్పర్సన్ సురేశ్ హవారే తెలిపారు. అంతే కాదు.. దర్శనం కోసం క్యూలలో గంటల తరబడి వేచి చూసే భక్తులకు ఇకపై టీ, కాఫీ, పాలు, బిస్కట్లు ఉచితంగా అందజేయాలని కూడా ట్రస్ట్ నిర్ణయించింది. మహారాష్ట్ర గ్రామాలు, శివారు ప్రాంతాల నుంచి రోగులను తరలించేందుకు 500 అంబులెన్స్‌లను ట్రస్ట్ సిద్ధం చేస్తోందన్నారు. కాగా, ఆస్ట్రేలియాలో స్థిరపడిన ప్రవాసాంధ్రుడు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అట్లూరి వెంకట్ సుహాస్..షిర్డీ సాయిబాబాకు బంగారు కిరీటాన్ని కానుకగా అందజేశారు. 748 గ్రాముల బరువున్న ఈ కిరీటంలో రూ.20 లక్షల విలువైన ముత్యాలు పొదిగారు. దసరా సందర్భంగా ఆయన షిర్డీ క్షేత్రాన్ని సందర్శించి.. హారతి సమయంలో కిరీటాన్ని అందజేశారని ట్రస్టు తెలిపింది.కాగా, విజయదశమి రోజున లక్ష మంది బాబా దర్శనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







