'ఏంజెల్' తదుపరి షెడ్యూల్‌ను గోదారి జిల్లాల్లో ప్లాన్ ..
- October 13, 2016
టాలీవుడ్ యంగ్ హీరో నాగ అన్వేష్, హేబా పటేల్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'ఏంజెల్'. రొమాంటిక కామెడీ సోషియో ఫాంటసీగా రూపొందుతున్న ఈ సినిమా తొలి దశ షఉటింగ్ ముగిసింది. 'బాహుబలి' ఫేం పళని డైరెక్షన్లో శ్రీ సరస్వతీ ఫిలింస్ బ్యానర్‌పై భువనసాగర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దాదాపు 15 రోజులు పాటు జరిగిన ఈ షెడ్యూల్లో నాగ అన్వేష్, హెబ్బాపటేల్, సప్తగిరిలపై రెండు ఫైట్లతో పాటు కీలక సన్నివేశాల్ని చిత్రకరించినట్లుగా దర్శకుడు బాహుబలి పళని తెలిపారు. ఇప్పటివరకు జరిగిన చిత్రీకరణ మొత్తం చాలా అద్భుతంగా వచ్చిందని ఈసన్ని వేశాలు కచ్చితంగా ప్రేక్షకుల్ని అలరిస్తాయని నిర్మాత భువన్సాగర్ చెప్పారు.వచ్చే నెలలో గోదారి జిల్లాల్లో 'ఏంజెల్' తదుపరి షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నారు. ఈ కొత్త తరహా చిత్రానికి భీమ్స్ సెసిరోలియో సంగీతం అందిస్తున్నారు. హాస్య సన్నివేశాలు బాగా రక్తి కట్టాయని దర్శకుడు బాహుబలి పళని తెలిపారు. హైదరాబాద్‌లోని టాంకబేండ్ బుద్ధ విగ్రహం దగ్గరలో వేసిన సెట్లో చేసిన షఉటింగ్ ఈ షెడ్యూల్ మొత్తం హైలెట్‌గా నిలిచిందని చిత్ర వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







