వివేకవంతుడైన శిష్యుడు
- August 18, 2015
ఒక ఆశ్రమంలో గురువు గారి దగ్గర ఇద్దరు శిష్యులుండేవారు. వారిద్దరిలో తెలివైనవారు, జనానికి ఉపయోగపడేవాడు ఎవడో నిర్ణయించాలని తలచి గురువు వారికి ఒక పందెం పెట్టాడు. వారిద్దరికీ సమానంగా కొంత ధనం ఇచ్చి, శిష్యులారా! నేను మీకిస్తున్న ఈ ధనం చాలా చిన్న మొత్తం. మీరు దీన్ని ఖర్చు చేసి తద్వారా కొన్న వస్తువుతో ఈ గదినంతా నింపాలి అని చెప్పారు. అందుకు ఆ శిష్యులు సరేనని ఇద్దరు వేర్వేరు చోట్టకి వెళ్లి తమ దగ్గరున్న సొమ్ముతో వస్తువులు కొని తేవాలనుకున్నారు. వారిలో ఒక శిష్యుడు తన దగ్గరున్న డబ్బు వమొత్తాన్ని ఖర్చు చేసి ఎండుగడ్డిని కొని తెచ్చి గదంతా నిండబెట్టి గురువుగార్ని పిలిచి చూడమన్నాడు. గురువు వచ్చి చూసి మనసులో చిన్నగా నవ్వుకుని సమాధానం చెప్పకుండానే వెళ్లి పోయాడు. రెండవ శిష్యుడు తన దగ్గర ఉన్న ధనంలో కొంత మాత్రమే ఖర్చు చేసి ఒక దీపాన్ని కొని గదిలో పెట్టి వెలిగించాడు. గురువు అది చూసి గదంతా వెలుగుతో నింపావు. నీవే నలుగురికి మేలు చేయగలవు. నీ తెలివి తేటలు అమోఘం అనీ, నలుగురికి వెలుతురునిద్దామనుకునే నీ వివేకం గొప్పది అని అతన్ని అభినందించాడు. అందుకు మొదటి శిష్యుడు కొంత ముఖం చిన్నబుచ్చుకుని గురువు దగ్గర మరింత కాలం శిక్షణ పొందసాగాడు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







