ఫ్రీ సిరియన్‌ ఆర్మీ చెక్‌ పోస్ట్‌ వద్ద కారు బాంబు పేలింది..

- October 14, 2016 , by Maagulf
ఫ్రీ సిరియన్‌ ఆర్మీ చెక్‌ పోస్ట్‌ వద్ద కారు బాంబు పేలింది..

సిరియా, టర్కీ సరిహద్దులోని ఫ్రీ సిరియన్‌ ఆర్మీ చెక్‌ పోస్ట్‌ వద్ద కారు బాంబు పేలింది. ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిలో ఎక్కువగా సిరియా తిరుగుబాటుదారులు ఉన్నట్లు భావిస్తున్నారు. బాబ్‌ అల్‌ సలామ్‌ సరిహద్దు సమీపంలో జబత్‌ అల్‌ షమియా అనే తిరుగుబాటుదారుల ఆధీనంలోని చెక్‌పోస్ట్‌ వద్ద పేలుడు సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపినట్లు సమాచారం. పేలుళ్లలో 30 మంది మరణించారని టర్కిష్‌ మీడియా తెలిపింది. డజన్ల మంది గాయపడగా.. వారిని చికిత్స కోసం ఆస్పత్రులకు తరలించారు. ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డట్లు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com