ఇంకొన్ని దేశాల నుంచి హౌస్‌హోల్డ్‌ కార్మికులు

- October 14, 2016 , by Maagulf
ఇంకొన్ని దేశాల నుంచి హౌస్‌హోల్డ్‌ కార్మికులు

జెడ్డా: మినిస్ట్రీ ఆఫ్‌ లేబర్‌ అండ్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌, మరికొన్ని దేశాల నుంచి హౌస్‌ హోల్డ్‌ లేబర్‌ని ఆహ్వానించేందుకు ఉన్న అవకాశాల్ని పరిశీలిస్తోంది. ఇండియా, శ్రీలంక, వియత్నాం, ఫిలిప్పీన్స్‌ తదితర దేశాల నుంచి ఇప్పటికే హౌస్‌ హోల్డ్‌ కార్మికుల రిక్రూట్‌మెంట్‌కి అవకాశం కల్పిస్తోంది ప్రభుత్వం. రానున్న రోజుల్లో హాంగ్‌ కాంగ్‌, మలేసియా వంటి దేశాల నుంచి కార్మికుల్ని రిక్రూట్‌ చేసుకునేందుకు ప్రయత్నాలు జాగుతున్నాయి. రిక్రూట్‌మెంట్‌ ఆఫీసెస్‌ కమిటీ ఛైర్మన్‌ యాహ్యా అల్‌ మక్బూల్‌ ఈ విషయమై మాట్లాడుతూ, కో-ఆర్డినేషన్‌ కమిటీలో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. డిమాండ్‌కి తగ్గ విధంగా హౌస్‌ హోల్డ్‌ రంగంలో కార్మికుల్ని నియమించే దిశగా ఈ చర్చలు జరుగుతున్నట్లు ఆయన వివరించారు. చాలా కార్యాలయాలు హౌస్‌ హోల్డ్‌ కార్మికుల్ని ఫిలిప్పీన్స్‌, బంగ్లాదేశ్‌ నుంచే రిక్రూట్‌ చేసుకుంటున్నట్లు తెలిపారాయన. ఇండోనేషియా, థాయిలాండ్‌, ఇథియోపియా దేశాల నుంచి కార్మికుల్ని రప్పించేందుకు ప్రతిపాదనలు వస్తున్నాయని, వాటిపై ఆలోచనలు చేస్తున్నామన్నారాయన. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com