చేపల మృతిపై విచారణ
- October 15, 2016
జెడ్డా: పెద్ద సంఖ్యలో చేపలు మృతి చెందిన ఘటనపై విచారణ జరుగుతోంది. ప్రభుత్వ శాఖలు, చేపల మృతికి కారణాలపై మల్లగుల్లాలు పడుతున్నారు. నీటిలో ఆక్సిజన్ లెవల్స్ తగ్గడమే పెద్ద సంఖ్యలో ఒకేసారి చేపలు మృతి చెందడానికి కారణంగా అనుమానిస్తున్నారు అధికారులు. మృతి చెందిన చేపల్లో కొన్నింటిని సేకరించి, వాటిని పరీక్షలకు పంపారు. జనరల్ అథారిటీ ఫర్ మెటియరాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటక్షన్ అండ్ ఫిషరీస్, మరియు మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ సంయుక్తంగా ఓ కమిటీని ఏర్పాటు చేసి, చేపల మృతికి గల కారణాల్ని అన్వేషించనున్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో చెల్లను ఇష్టమొచ్చినట్లుగా పడేయడం వల్ల కాలుష్యం పెరుగుతోందనీ, అది కూడా చేపల మరణానికి కారణం కావొచ్చునన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకో వైపున చనిపోయిన చేపల్ని మార్కెట్లో కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు. జెడ్డా కోర్నిచ్ అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఉందనీ, కాలుష్యం పెరిగిపోవడం వల్ల సముద్ర జీవులకు కష్టాలు ఏర్పడుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు







