23 శాతం మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్
- October 15, 2016
ముందుగానే బ్రెస్ట్ క్యాన్సర్‌ని గుర్తిస్తే, తగిన వైద్య చికిత్స అందించడం ద్వారా పూర్తిస్థాయిలో క్యాన్సర్‌ని నయం చేసేందుకు అవకాశం ఉంటుందని వైద్యాధికారులు చెప్పారు. కువైట్‌లో 23 శాతం మంది మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయని వారు తెలిపారు. కువైట్ క్యాన్సర్ కంట్రోల్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఖులూద్ అల్ అలి మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు ఆందోళనకరమైన రీతిలో పెరుగుతున్నట్లు చెప్పారు. మమ్మోగ్రఫీ ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్‌ని తొలి దశలోనే గుర్తించవచ్చని ఆమె వివరించారు. 2013లో నిర్వహించిన పరీక్షల్లో 100 మందికిగాను 57 మందికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్లు తేలిందనీ, సగటున 54 శాతం మందికి బ్రెస్ట్ క్యాన్సర్‌ని గుర్తించామనీ, ఇందులో 12 శాతం మహిళలు 40 ఏళ్ళ వయసు లోపు ఉన్నట్లు తెలిపారు. బ్రెస్ట్ క్యాన్సర్ రికవరీ రేట్ 80 శాతం పైగానే ఉన్నందున, ముందస్తుగా గుర్తించడమే ముఖ్యమన్న విషయం అందరూ గుర్తించుకోవాలని ఆమె స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







