'తెలంగాణ ప్రజా సమితి ఖతార్' ఆధ్వర్యం లో ఘనంగా జరిగిన 'బతుకమ్మ సంబరాలు'
- October 15, 2016
తెలంగాణ ప్రజా సమితి ఖతార్ ఆధ్వర్యం లో అక్టోబర్ 14 శుక్రవారం రోజున అశోక హాల్ ఐసీసీ లో సాయంత్రం 5 గంటల నుండి "దసరా బతుకమ్మ సంబరాలు" ఆహ్లాదకరమైన వాతావరణం లో అంగరంగ వైభవంగా జరిగాయి. ముఖ్య అతిధులుగా రాజ్ కుమార్ సింగ్ గారు (డిప్యూటీ చీఫ్ మిషన్), ఐసీసీ ప్రెసిడెంట్ గిరీష్ కుమార్ గారు, మాల మేడం (వైస్ ప్రిన్సిపాల్ -- ఢిల్లీ పబ్లిక్ స్కూల్) గారు, గౌరవ అతిధులు కోడూరు ప్రసాద్ (అడ్వైసరీ కౌన్సిల్ మెంబెర్ ) గారు, హరీష్ రెడ్డి (టి కె ఎస్ ప్రెసిడెంట్) గారు, హాజరై అందరికి దసరా శుభాకాంక్షలు తెలుపుతూ మరియు టి పి ఎస్ ఖతార్ చేస్తున్న సేవలను కొనియాడారు.
ఈ వేడుకలను జాతీయ గీతాలాపన మరియు జ్యోతి ప్రజ్జ్వలన తో మొదలై సాంస్కృతిక కార్యక్రమాలు, తెలంగాణ ఆడపడుచుల బతుకమ్మ ఆట పాటలతో, జానపదాలు, పేరడీ పాటలతో, వేడుకకు వచ్చిన అతిధులను ఆద్యంతం అలరించారని తెలంగాణ ప్రజా సమితి కార్యవర్గం పేర్కొన్నారు. గల్ఫ్ లో ఉంటూ కూడా ఇలాంటి పండగలని జరపడం ద్వారా తెలంగాణ సంస్కృతీ ని చాటిచెప్పడమే కాకుండా యాంత్రిక జీవనం లో ఒక ఆట విడుపు గా ఉందని ఉందని ఈ సంబరాలకు హాజరైన వారు హర్షం వ్యక్తం చేసారు. జమ్మి ఆకు పంచుకొని, అలై బలై చేసుకొని సోదరభావాని పంచుకున్నారు. తెలంగాణ వంటలతో రుచికరమైన భోజనం చేశామని వారికీ సొంత వూరు, తమ అక్క చెల్లెల్లు గుర్తొచ్చారని కార్మిక సోదరులు మల్లి మల్లి ఇలాంటి వేడుకలకి రావాలని, జరపాలని కోరుకున్నారు..
అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ మరియు ప్రవాసీ మిత్ర తరపున జరిగిన ప్రవాసీ బతుకమ్మ సంబరాల్లో "స్త్రీ శక్తి" అవార్డు అందుకున్న టి పి ఎస్ కార్య వర్గ సభ్యులైన శ్రీమతి అనుపమ సంగిశెట్టి గారికి, మరియు మిథిలా రెడ్డి గారికి కూడా సత్కరించామని వారు తెలిపారు.
ఇలాంటి వేడుకలకి సహకరించిన పెద్దలకు, వాలంటీర్లకు, దాతలకు తెలంగాణ ప్రజా సమితి ధన్యవాదాలు తెలుపుతూ. ముందు ముందు ఇంకా ఎన్నో ఇలాంటి ఉత్సవాలని జరుపుతామని ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబెర్స్ ఐన రాజేశ్వర్ రావు, శ్రీనివాస్ అల్లే, అశోక్ గంగుల, అంజయ్య వట్టముల, శోభన్ బంధారపు, భానుప్రకాష్, సందీప్ బొడ్ల, శ్రీధర్ అబ్బగౌని, రవి గౌడ్, శంకర్ గౌడ్, అనుపమ సంగిశెట్టి, ప్రత్యూష చెన్న, మారుతి వెల్లూరు, మిథిలా రెడ్డి, కిరణ్ కుమార్ పొడకంటి, నరేష్, వెంకట్ గౌడ్, ప్రసాద్ కోడూరు గార్లు తెలిపారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)







తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









