ప్రతిరోజూ ఆరు బాదంతో అందంగా ఆకర్షణీయంగా..!
- October 16, 2016
ఆధునిక సమాజంలో జీవనశైలిలో విపరీతమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇందులో ముఖ్యమైనది అందంగా కనిపించడం. ఇందుకోసం చేతివేలి గోరు నుంచి పాదాల వరకూ అన్నీ అందంగా ఆకర్షణీయంగా ఉంచుకోవాలని టీనేజ్ అమ్మాయిలు తహతహలాడుతుంటారు. ముఖ్యంగా సెక్సియెస్ట్ బెల్లీ... అంటే అత్యంత ఆకర్షణీయంగా నడుము, ఉదర భాగాలను ఉంచుకునేందుకు అమ్మాయిలు తెగ యత్నిస్తుంటారు. నడుము, ఉదర భాగాలు సెక్సీగా ఉంచుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.
* కనీసం వారంలో మూడుసార్లయినా సుమారు అరగంటపాటు నడకను గానీ, వ్యాయామంకానీ చేయాలి. ఇలా చేయడం ద్వారా పొట్టవద్ద చేరిన కొవ్వు కరిగి స్లిమ్‌గా మారుతుంది.
* ఫైబర్లు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. వైట్ బ్రెడ్, బంగాళాదుంపలు, అన్నం తగినంత తీసుకోవాలి.
* ఇంకా చెప్పాలంటే గోధుమ రొట్టెలకంటే ముడిబియ్యాన్ని తీసుకోవడం చాలా ఉత్తమం. పండ్లు, కూరగాయలకు ప్రాధాన్యతనివ్వండి. ఇవి పొట్టలో కొవ్వు చేరకుండా చూడటంలో సహాయపడతాయి.
* పాలు తాగే అలవాటున్నవారు కొవ్వులేని పాలును తీసుకోవడం మంచిది.
* శరీరంలోని అవయవాలన్నిటికీ పని కల్పించే విధంగా ఓ పది లేదా పదిహేను నిమిషాలు వ్యాయామం చేయాలి. కూర్చుని పనిచేసే ఉద్యోగం చేసేవారైతే కనీసం గంటకోసారి కుర్చీలోంచి లేచి ఓ ఐదు నిమిషాలు అటుఇటు తిరిగి రావడం మంచిది. లేదంటే బానపొట్ట పెరగడం ఖాయం.
* ప్రతిరోజూ ఉదయం పూట ఓ 6 బాదం పప్పులను నమలండి. ఆరు నుంచి ఎనిమిది గ్లాసుల నీటిని తాగండి. జీర్ణ సంబంధ సమస్యలు రాకుండా జాగ్రత్త పడండి.
* ఒకేసారి భారీగా భోజనాన్ని లాగించేయకుండా రెండు మూడుసార్లు కొద్దికొద్దిగా తినండి. ఫలితంగా పొట్ట ముందుకు పొడుచుకు వచ్చినట్లు కనిపించకుండా స్లిమ్‌గా ఉండవచ్చు. అంతేకాదు పడక గదికి వెళ్లే ముందు కనీసం మూడుగంటల ముందే భోజనాన్ని ముగించండి. ఇవన్నీ పాటించండి సెక్సియెస్ట్ బెల్లీ సొంతమవుతుంది.
తాజా వార్తలు
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్‌లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక







