పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవటమే ప్రమాదానికి కారణo
- October 17, 2016
సెంట్రల్ మయన్మార్లోని ఓ నదిలో పడవ ప్రమాదం చోటు చేసుకంది. మొనైవా నగరానికి 72 కిలోమీటర్ల దూరంలో ఉన్న చింద్విన్ నదిలో పడవ బోల్తా పడి 14 మంది ప్రాణాలు కోల్పోయారు. శనివారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఈ ఘటనలో ఇప్పటికే 14 మంది మృతదేహాలను వెలికి తీశారు. 154 మందిని ప్రాణాలతో రక్షించారు. ప్రమాదం జరిగిన సమయంలో 240 నుంచి 250 మంది వరకు ప్రయాణికులు పడవలో ఉన్నారని, వారంతా యూనివర్శిటీ విద్యార్థులు, టీచర్లు, డాక్టర్లని అధికారి ఒకరు వెల్లడించారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని మృతుల సంఖ్య 100కి పెరిగే అవకాశముందని ఆయన తెలిపారు. .
ప్రమాదానికి సంబంధించి పడవలో పని చేస్తున్న నలుగురు సిబ్బందిని అరెస్టు చేశామన్నారు.పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవటమే ప్రమాదానికి కారణమని అధికారులు వెల్లడించారు. తీర ప్రాంతాల్లో ఉండే ప్రజలు రవాణా కోసం ఎక్కువగా పడవలను ఆశ్రయిస్తుంటారు. పడవ నిర్వాహకులు ప్రమాణాలు పాటించకుండా పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవటంతో ఇటువంటి ప్రమాదాలు మయన్మార్లో తరచూ జరుగుతున్నాయని అధికారులు అన్నారు.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







