కీర్తి సురేశ్ కి గోల్డెన్ ఛాన్స్..
- October 17, 2016
'నేను శైలజ' ఫేం కీర్తి సురేశ్ పుట్టినరోజు నాడు గోల్డెన్ ఛాన్స్ దక్కించుకుంది. అగ్రహీరో సరసన నటించే అవకాశాన్ని చేజిక్కించుకుంది. విలక్షణ నటుడు సూర్యతో ప్రాజెక్టు ఓకే చేసింది. విఘ్నేశ్‌శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమిళ యాక్షన్ థిల్లర్ 'తానా సేర్న్‌ద కూటం' సినిమాలో నటించేందుకు ఒప్పుకుంది. సోమవారం ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని నిర్మాతలు వెల్లడించారు. వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభంకానుంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్న ఈ సినిమాను స్టూడియో గ్రీన్ పతాకంపై నిర్మించనున్నారుఇటీవల విడుదలైన 'రెమో' సినిమాలో శివకార్తికేయన్ కు జోడిగా కీర్తి నటించింది.విజయ్ హీరోగా నటిస్తున్న తమిళ సినిమా 'భైరవ', తెలుగులో 'నేను లోకల్' సినిమాలో నాని సరసన ఆమె నటిస్తోంది. రామ్, కీర్తి జంటగా నటించిన 'నేను శైలజ' సినిమా విజయం సాధించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- షార్లెట్‌లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









