వింటర్ హెచ్చరిక: సైక్లిస్టులూ జాగ్రత్త
- October 18, 2016
మనామా: వింటర్ వస్తుండడంతో ఔత్సాహిక సైక్లిస్ట్‌లు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. వాతావరణ మార్పుల కారణంగా సైక్లిస్టులు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంటుంది గనుక సైక్లిస్టులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సదరన్ ఏరియా మునిసిపల్ కౌన్సిల్ ఛైర్మన్ అహ్మద్ అన్సారి మాట్లాడుతూ, వింటర్ సీజన్లో సైక్లిస్టులు రద్దీగా ఉండే రోడ్లపై అప్రమత్తంగా ఉండాలని, సైకిల్స్‌తో ఎలాంటి స్టంట్స్ చేయకూడదని ఆయన హెచ్చరించారు. రోడ్లపై స్టంట్స్ చేసే సైక్లిస్టులపై తగిన చర్యలు ఉంటాయని ఆయన తెలిపారు. ఈ ఏడాది ఇప్పటిదాకా 8 మంది సైక్లిస్టులు మృతి చెందారు. పలువురు గాయాలపాలయ్యారు. సైక్లింగ్ని ప్రోత్సహించాల్సి ఉందనీ, సైక్లింగ్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, అయితే దాన్ని స్టంట్స్ కోసం వినియోగిస్తుండడంతోనే సమస్యలు వస్తున్నాయని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







