పాక్ భారత్ టీవీ-రేడియో కార్యక్రమ ప్రసాలపై నిషేధం విధించింది..
- October 20, 2016
ఉరి ఉగ్రదాడి నేపద్యంలో భారత్, పాక్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడమే కాదు.. కొన్ని విషయాల్లో అధికారిక, అనధికారిక నిషేధం కూడా కొనసాగుతున్నాది. భారత్ లో పాక్ కళాకారులపై నిషేధం... గుజరాత్ వ్యాపారులు టమోటో, మిర్చి ఎగుమతులను స్వచ్చందంగా నిలిపివేయడం... ప్రపంచ కబడ్డీ పోటీలకు పాక్ జట్టును నిషేధించడం.. సార్క్ సమావేశాలను బహిష్కరించడం వంటివి జరుగుతూనే ఉన్నాయి.. కాగా పాక్ ప్రభుత్వం కూడా భారత్ కు సంబంధించిన వాటిపై నిషేధం విధిస్తున్నారు.. ఇప్పటికే ధోని సినిమా రిలీజ్ ను అడ్డుకొన్న పాక్ ప్రభుత్వం.. తాజాగా భారత్ టీవీ-రేడియో కార్యక్రమ ప్రసాలపై నిషేధం విధించింది... ఈ నెల 21 అనగా శుక్రవారం మద్యాహ్నం 3 గంటలనుంచి ఈ నిషేధం అమలు కానున్నట్లు పాకిస్తాన్ ఎలక్ట్రానిక్స్ రెగ్యులేటరీ అథారిటీ నిర్ణయించింది. ప్రభుత్వ సూచన మేరకు ఈ నిషేధం అమలు చేయనున్నట్లు తెలిపింది.. ఎవరైనా పెమ్రా నిర్ణయాన్ని కాదని భారత్ ప్రసారలను చేస్తే వారిపై చర్చలు తీసుకొంటామని... లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించింది.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







