కట్టో మీటో కైమా
- October 20, 2016
కావలసినవి: మటన్ కైమా 500 గ్రా, సన్నగా తరిగిన రెండు పెద్ద ఉల్లిపాయలు, రెండు పెద్ద టమోటాలు (సన్నగా కోసుకోవచ్చు లేదా గుజ్జుగా చేసుకోవచ్చు), ఆలుగడ్డలు రెండు (తొక్కుతీసి కడిగి సన్నగా కోసుకోవాలి), అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూను, పసుపు కొద్దిగా, కారం ఒక టేబుల్ స్పూన్, సాంబారు మసాలా ఒక టీస్పూను, వినెగర్ ఒక టేబుల్ స్పూన్, బెల్లం చిన్నగడ్డ, నూనె రెండు టేబుల్ స్పూనులు, ఉప్పు తగినంత.
ఎలా చేయాలి
కైమా బాగా కడిగి అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి అరగంటసేపు పక్కన పెట్టేయండి. గిన్నెలో నూనె వేడిచేసి ఉల్లిపాయలు వేగాక అన్ని మసాలా పొడులు కలిపి ఇంకో నిమిషం, రెండు నిమిషాలు వేగించండి. తర్వాత కైమా, ఉప్పు, టమోటాలు వేసి సన్నసెగ మీద ఉడికించండి లేదా కుక్కర్లో పెట్టండి. కైమా ఉడికాక ఆలుముక్కలు వేసి అవీ ఉడికాక వినెగర్, బెల్లం కలపండి. బెల్లం కరిగాక దింపేసి వేడివేడిగా వడ్డించండి. బ్రెడ్, చపాతీ, కిచడీలలో దేనితో కలిపి తిన్నా బాగుంటుంది.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









