ప్రకాష్ రాజ్ స్థాయిలో నటించానా ?
- October 20, 2016
'లెజెండ్' సినిమా ద్వారా విలన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు టాప్ విలన్ గా మారిపోయిన జగపతిబాబు ఒక సినిమాలోని పాత్ర కోసం రాజకీయం చేసి ఆ పాత్రను దక్కించుకున్నాడు అంటే అందరూ ఆశ్చర్య పోయే విషయం. అయితే ఈ విషయాన్ని స్వయంగా జగపతి బాబు ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బయట పెట్టాడు.
ఈరోజు విడుదల అవుతున్న 'ఇజం' సినిమాను దర్శకుడు పూరి కళ్యాణ్ రామ్ లతో కలిసి ప్రమోట్ చేస్తూ నిన్న ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగపతి బాబు ప్రకాష్ రాజ్ కోసం 'ఇజం' లో క్రియేట్ చేయబడ్డ పాత్రను తాను ఎలా మేనేజ్ చేసి దక్కించుకుంది వివరంగా వివరించాడు. ఈసినిమా నిర్మాణ వ్యవహారాలను చూస్తున్న నిర్మాత కళ్యాణ్ రామ్ బావమరిది తనకు అత్యంత సన్నిహితుడు కావడంతో 'ఇజం' లోని విలన్ పాత్ర ప్రకాష్ రాజ్ కు కాకుండా తనకు కావాలని ఒత్తిడి చేసాడట.
ఇలా చేయడానికి గల కారణం 'ఇజం' లో డిజైన్ చేయబడ్డ విలన్ పాత్ర తనకు అంత బాగా నచ్చింది అని అంటున్నాడు. అయితే ప్రకాష్ రాజ్ పూరి జగన్నాథ్ ల సాన్నిహిత్యం తనకు బాగా తెలియడంతో ఈ విషయంలో సక్సస్ సాధించడానికి తాను చాల కష్టపడ్డాను అంటూ పూరి వంక చూస్తూ జోక్ చేసాడు జగపతి బాబు.
ఒక ఛానల్ ఇంటర్వ్యూలో జగపతి బాబు ఈ విషయాన్ని ఇంత బోల్డ్ గా చెప్పడంతో షాక్ అయిన పూరి జగన్నాథ్ ఈసినిమా కథ 5 సంవత్సరాల క్రితం అనుకున్నది కావడంతో అప్పట్లో ఈ పాత్రకు ప్రకాష్ రాజ్ ను అనుకున్నది వాస్తవమే అయినా ఇప్పుడు 'ఇజం' విషయంలో ప్రకాష్ రాజ్ ను సంప్రదించలేదు అంటూ మాట సద్దుకున్నాడు.అయితే ఇంతటితో ఆగకుండా తాను ప్రకాష్ రాజ్ స్థాయిలో నటించానా ? అంటూ జగపతి బాబు మరోసారి కార్నర్ చేస్తే మీ స్థాయిలో మీరు బాగా నటించారు అంటూ పూరి జగపతి బాబు పై సెటైర్ వేసాడు.దీనితో విలన్ పాత్రలు తన ఇంటికి క్యూ కట్టి వస్తూ ఉన్నా జగపతి బాబు 'ఇజం' లోని ఈ విలన్ పాత్ర పై ఎందుకు ఇంత ఆసక్తి కనపరిచాడు అని ఈ ఇంటర్వ్యూ చూస్తున్న చాలామందికి సందేహం కలుగుతుంది. కళ్యాణ్ రామ్ కెరియర్ లో అత్యంత భారీ బడ్జెట్ మాత్రమే కాకుండా అత్యధిక సంఖ్య ధియేటర్లలో విడుదల అవుతున్న 'ఇజం' ఫలితం మరి కొన్ని గంటలలో తేలిపోతుంది..
తాజా వార్తలు
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక







