ట్రాలీ బ్యాగ్ లో తరలిస్తున్న 12 బంగారు బిస్కెట్లను సీజ్..
- October 20, 2016
అధికారులు ఎంత నిఘా పెట్టినా...అక్రమార్కులు మాత్రం వివిధ మార్గాల ద్వారా బంగారాన్ని తరలిస్తూనే ఉన్నారు. తాజాగా ముంబయిలోని ఛత్రపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్ద ఎత్తున బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో భాగంగా రూ.38 లక్షల విలువైన 12 గోల్డ్ బిస్కెట్లను కస్టమ్స్ అధికారులు శుక్రవారం పట్టుకున్నారు.ట్రాలీ బ్యాగ్ లో తరలిస్తున్న 12 బంగారు బిస్కెట్లను సీజ్ చేసిన అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గత నెలలో కూడా దుబాయి నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 19 లక్షల విలువైన బంగారాన్ని పట్టుకున్నారు. మరోవైపు బీఎస్ ఎఫ్ జవాన్లు గురువారం ఓ బంగ్లాదేశీ పౌరుడు వద్ద సుమారు కేజీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







