పశ్చిమ జపాన్‌లో భూకంపం...

- October 21, 2016 , by Maagulf
పశ్చిమ జపాన్‌లో భూకంపం...

పశ్చిమ జపాన్‌లో భూకంపం సంభవించింది. జపాన్‌ కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 6.2గా నమోదైంది. టోక్యోకి పశ్చిమాన 700కి.మీ. అవతల ఉన్న టొట్టోరిలో 10 కి.మీ. లోతున ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు భూ విజ్ఞాన శాస్త్ర అధికారులు తెలిపారు. అయితే దీని వల్ల సునామీ సంభవించే ప్రమాదం ఏమీ లేదన్నారు. ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టాలు గుర్తించలేదని, కానీ భూకంపం వల్ల విద్యుత్‌ లైన్లు దెబ్బతినడంతో దాదాపు 40వేల ఇళ్లకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిందని స్థానిక అధికారులు తెలిపారు.తరచూ భూకంపాలు సంభవించే జపాన్‌లో గతంలో అధిక తీవత్రతోసంభవించిన భూకంపాల వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com