'డీజే దువ్వాడ జగన్నాథమ్'షూటింగ్ మొదలు
- October 21, 2016
'సరైనోడు'తో మంచి జోష్ మీదున్న అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం 'డీజే దువ్వాడ జగన్నాథమ్'. ఈ మధ్యనే ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభం కాగా ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తికావడంతో గురువారం నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను హైదరాబాద్‌లో మొదలుపెట్టారు. ఇందులో అర్జున్ సరసన పూజాహెగ్డే నాయికగా నటిస్తోంది. హరీష్‌శంకర్.ఎస్. దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ను మొదలుపెట్టిన చిత్రబృందం ఫిబ్రవరి వరకు చిత్రీకరణను కొనసాగించనున్నట్లు సమాచారం.యాక్షన్ కామెడీ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న హరీష్‌శంకర్ ఈ సినిమాను అల్లు అర్జున్‌కు తగ్గట్టుగా అదే కోణంలో మలుస్తున్నారు. తన ప్రతీ సినిమాలో కొత్తదనంగా కనిపించే అల్లు అర్జున్ ఇందులో కూడా అలానే కనిపించబోతున్నారట. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావాలన్న లక్ష్యంతో చిత్రబృందం ముందుకు సాగుతోంది. ఇంతవరకు పలువురు హీరోలతో సినిమాలను చేసిన హరీష్‌శంకర్ తొలిసారి అల్లు అర్జున్ కలయికలో సినిమా చేస్తున్నారు. దీనిపట్ల హరీష్‌శంకర్ ఆనందాన్ని వ్యక్తంచేస్తూ, ప్రేక్షకాభిమానుల అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా ఉంటుందని చెప్పుకొచ్చారు. మరోవైపు తమ సంస్థలో అల్లు అర్జున్ చేస్తున్న మూడవ చిత్రమిదని దిల్‌రాజు తెలియజేస్తూ, ఈ చిత్రం స్క్రిప్ట్ ఎంతోబాగా వచ్చిందని, కథను నమ్ముకని సినిమాలను చేస్తూ వస్తున్న తమ సంస్థకు ఇది మరో విజయవంతమైన చిత్రంగా నిలుస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.
ఈ చిత్రానికి కెమెరా: ఐనాక బోస్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: రవీందర్, ఫైట్స్: రామ్, లక్ష్మణ్, స్క్రీన్‌ప్లే: దీపక్‌రాజ్, నిర్మాత: దిల్‌రాజు, కథ, మాటలు, దర్శకత్వం: హరీష్‌శంకర్.ఎస్.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







