మణిపూర్ ముఖ్యమంత్రి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు
- October 24, 2016
మణిపూర్ ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఆయనపై సోమవారం అనుమానిత ఎన్ఎస్‌సీఎన్ ఉగ్రవాదులు దాడి చేశారు. ఉక్రుల్ హెలిపాడ్‌లో ఆయనపై దాడి జరిగింది. అదృష్టవశాత్తూ ఆయన గాయపడలేదు. ప్రస్తుతం ఆయన ఇంఫాల్ వెళ్ళారు. ఆదివారం రాత్రి హుండుంగ్ ప్రాంతంలో వరుస బాంబు పేలుళ్ళు సంభవించిన సంగతి తెలిసిందే. ఉక్రుల్ జిల్లా కేంద్రంలో అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి ఓక్రమ్ వచ్చారు. ఈ సందర్భంగా పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. వారం రోజుల నుంచి ఇండియన్ రిజర్వు బెటాలియన్ జవాన్లు భద్రత ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
తాజా వార్తలు
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!







