నవంబర్ 4న విడుదల కానున్న 'పిల్ల రాక్షసి'
- October 24, 2016
బిచ్చగాడు` వంటి సెన్సేషనల్ హిట్ చిత్రాన్ని అందించిన శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై చదలవాడ పద్మావతి అందిస్తున్న మరో చిత్రం పిల్ల రాక్షసి. మలయాళంలో ఘన విజయం సాధించిన `ఆన్ మరియ కలిప్పిలాను` తెలుగులో `పిల్ల రాక్షసి` పేరుతో నవంబర్ 4న విడుదల చేస్తున్నారు. `బిచ్చగాడు` చిత్రానికి తెలుగులో మాటలు, పాటలు అందించిన రచయిత భాషాశ్రీ మలయాళ చిత్రం `ఆన్ మరియ కలిప్పిలాను` తెలుగు అనువాదానికి మాటలు, పాటలు అందించారు. ఓ ఫ్రాడ్‌స్టర్‌తో చిన్నారి చేసిన సావాసం ఎలాంటి పరిణామాలకు దారి తీసిందనే కాన్సెప్ట్ తో రూపొందిన సినిమానే పిల్ల రాక్షసి. ఈ సినిమా ఆడియో, ట్రైలర్ లు ఇటీవలే విడుదలయ్యాయి. ఈ మూవీలో `ఓకే బంగారం` ఫేం దుల్కర్ సల్మాన్ ఓ ముఖ్య అతిధిగా నటించగా, సారా అర్జున్ టైటిల్ పాత్రలో నటించింది.
సన్ని వాయ్నే, అజు వర్గీస్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. బిచ్చగాడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్ పై వస్తున్న చిత్రం కావడంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.a
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







