బిషారో అతిథి గృహంపై గుర్తుతెలియని వ్యక్తులు బాంబు దాడి..
- October 25, 2016
కెన్యాలోని ఓ అతిథి గృహంలో మంగళవారం ఉదయం బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో 12 మంది పౌరులు మృతిచెందారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మండేరా ప్రాంతంలోని బిషారో అతిథి గృహంపై గుర్తుతెలియని వ్యక్తులు బాంబు దాడి చేశారు. ఈ ఘటనలో 12 మంది అక్కడికక్కడే మృతిచెందగా.. భవనం పూర్తిగా ధ్వంసమైంది. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉన్నారని పోలీసులు తెలిపారు. భద్రతా సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు యత్నిస్తున్నారు. అల్-షబాబ్ ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.ఘటన అనంతరం ఉగ్రవాదులు సోమాలియా సరిహద్దు వైపునకు పారిపోయినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







