ఇంటర్నెట్‌లో ఫేక్ డ్రగ్స్, హెల్త్ ప్రోడక్ట్స్
- October 25, 2016
మనామాం ఆన్‌లైన్ ద్వారా నకిలీ డ్రగ్స్, నకిలీ హెల్త్ ప్రోడక్ట్స్ ప్రాచుర్యంలోకి వస్తున్నాయని నేషనల్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ మరియమ్ అల్ జలాహ్మా చెప్పారు. వెబ్‌సైట్లలో కన్పించే హెల్త్ ప్రోడక్ట్స్ లేదా డ్రగ్స్ విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆమె విజ్ఞప్తి చేశారు. 'సహజసిద్ధమైన' అని పేర్కొంటారుగానీ, వాటిల్లో కెమికల్స్ ఉపయోగించబడ్తాయని వివరించారు. ఈ ఏడాది ఇప్పటిదాకా 1,931 పర్సనల్ పార్సెల్స్‌ని పరిశీలిస్తే అందులో 64 శాతం అక్రమమం అని తేలిందని అల్ జలాహ్మా తెలిపారు. చాలా మెడిసన్స్‌కి ఆరిజన్ ఉండదనీ, వీలైనంత వరకు కస్టమ్స్‌లోనే వీటిని అడ్డుకోవడం జరుగుతుందనీ, అక్రమ మార్గాల్లో వచ్చేవాటి పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి, అనుమానాస్పద ఉత్పత్తుల గురించి సమాచారాన్ని అధికారులకు అందజేయాలని చెప్పారు అల్ జలాహ్మా.
తాజా వార్తలు
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!







