మైనర్‌ అఫెన్స్‌లకు ఇకపై నో జైల్‌

- October 25, 2016 , by Maagulf
మైనర్‌ అఫెన్స్‌లకు ఇకపై నో జైల్‌

అబుదాబీ: యూఏఈ పీనల్‌ కోడ్‌కి చిన్న చిన్న మార్పులు చేసి, మైనర్‌ అఫెన్స్‌లకు జైలు శిక్షలు లేకుండా, వాటి స్థానంలో కమ్యూనిటీ సర్వీసుతో సమాజంలో మార్పు తీసుకురావాలని భావిస్తున్నారు. కమ్యూనిటీ పే బ్యాక్‌లో భాగంగా రోడ్లను శుభ్రపరచడం, సేవా కార్యక్రమాలు చేపట్టడం వంటివాటితో చిన్న చిన్న నేరస్తుల ఆలోచనల్ని మార్చవచ్చని మినిస్ట్రీ ఆఫ్‌ జస్టీస్‌ అభిప్రాయపడింది. మినిస్టర్స్‌ ఆఫ్‌ ఇంటీరియర్‌ మరియు ఎమిరైటైజేషన్‌ మరియు హ్యూమన్‌ రిసోర్సెస్‌ అంగీకారంతో ప్రెసిడెంట్‌ షేక్‌ ఖలీఫా బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ గత నెలలో కొత్త చట్టాన్ని ఆమోదించారు. వచ్చే నెల నుంచి ఈ చట్టం అమల్లోకి వస్తుంది. 2009లో క్యాబినెట్‌, పెడరల్‌ లా ఆఫ్‌ ఆల్టర్నేటివ్‌ పనిష్‌మెంట్‌ని ఆమోదించింది. ఇందులో 20 అపెన్సెస్‌ని కమ్యూనిటీ సర్వీస్‌ రేంజ్‌లోకి తీసుకొచ్చారు. 20 నుంచి 240 గంటల పాటు కమ్యూనిటీ సర్వీసెస్‌ని శిక్షగా విధించేందుకు వీలు కల్పించింది. అయితే కొత్త చట్టాల ప్రకారం కొన్ని నేరాలకు శిక్షల్ని కఠినంగానే అమలు చేసే అవకాశం ఉంది. యూఏఈకి వ్యతిరేకంగా యుద్ధ నేరాలకు పాల్పడేవారికి తీవ్రమైన శిక్షలుంటాయి. ఇందులో అతి తీవ్రమైనది ఉరిశిక్ష. ప్రెసిడెంట్‌ని అవమానించేలా వ్యవహరిస్తే 15 నుంచి 25 ఏళ్ళ జైలు శిక్ష, జరీమానా ఉంటాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్గనైజేషన్లు నడిపేవారికి జీవిత కాల శిక్ష విధిస్తారు. గ్యాంబ్లింగ్‌ సహా పలు నేరాలకు జైలు శిక్ష, జరీమానాల్ని తీవ్రస్థాయిలో విధించడం మామూలే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com