క్లినికల్ నాన్ క్లినికల్ స్టాఫ్‌కి ఉద్యోగాలు
- October 26, 2016హమాద్ మెడికల్ కార్పొరేషన్ (హెచ్ఎంసి) అతి పెద్ద రిక్రూట్మెంట్ డ్రైవ్‌ని ప్రకటించింది. మొత్తం 2,690 క్లినికల్ మరియు నాన్ క్లినికల్ పోస్టులు ఇందులో ఉన్నాయి. ఈ ఏడాది చివరి నాటికి ఈ ఉద్యోగాల్ని భర్తీ చేయనుంది హమాద్ మెడికల్ కార్పొరేషన్. వచ్చే ఏడాది హమాద్ బిన్ ఖలీఫా మెడికల్ సిటీ, కొత్త హాస్పిటల్స్, ఇతర హెల్త్ కేర్ సర్వీసులు ప్రారంభం కానున్న దరిమిలా, ఈ ఉద్యోగాల ప్రకటన వచ్చినట్లు హెచ్ఎంసి వర్గాలు పేర్కొన్నాయి. 2017 చివరినాటికి ఏడు కొత్త హాస్పిటల్స్ ప్రారంభం కానున్నాయి. హమాద్ బిన్ ఖలీఫా మెడికల్ సెంటర్లలో విమెన్స్ వెల్నెస్ అండ్ రీసెర్చ్ సెంటర్, అంబులేటరీ కేర్ సెంటర్, ఖతార్ రిహాబిలిటేషన్ ఇన్స్టిట్యూట్లను ఏర్పాటు చేస్తున్నారు. కొరియాకి చెందిన హుండై ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ, మెడికల్ ప్రాజెక్టులో కీలక భాగస్వామి. 2014లోనే దీన్ని పూర్తి చేయవలసి ఉంది. ఖతార్‌లో బ్లూ కాలర్ వర్కర్స్ మరియు కమ్యూనికబుల్ డిసీజస్ సెంటర్‌ని మెడికల్ సిటీకి దగ్గరలో రూపొందిస్తున్నాఉ. ఇది కూడా వచ్చే ఏడాది ప్రారంభమవుతుంది.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







