వలసదారుల్లో ఇండియన్లే టాప్‌

- October 26, 2016 , by Maagulf
వలసదారుల్లో ఇండియన్లే టాప్‌

కువైట్‌: ఇంటీరియర్‌ మినిస్ట్రీకి చెందిన రెసిడెన్సీ ఎఫైర్స్‌ డిపార్ట్‌మెంట్‌ వెల్లడించిన వివరాల ప్రకారం రెసిడెన్సీ వీసాలు ఉన్న వలసదారుల సంఖ్య 2,670,000గానూ, అందులో 901,000 భారతీయ వలసదారులుగాను తేల్చింది. గడచిన ఆరు నెలల్లో 100,000 మంది భారతీయుల సంఖ్య పెరిగింది. ఆ తరువాతి స్థానంలో 587,700 సంఖ్యతో ఈజిప్టియన్లు ఉన్నారు. సిరియన్ల సంఖ్య 145,000గా ఉంది. బంగ్లాదేశీయుల సంఖ్య 202,000 (60,000 పెరుగుదల), 243,000 మంది ఫిలిప్పీన్స్‌, 39,000 ఇరానియన్స్‌, 60,00 నేపాలీస్‌ ఉన్నారు. ఏడు దేశాలకు చెందినవారి సంఖ్య మొత్తం విదేశీయుల్లో 90 శాతానికి పైగా ఉందని నివేదికలు చెబుతున్నాయి. కువైట్‌ జనాభాలో 2 / 3 వంతు విదేశీయులే ఉన్నారు. ఈ నేపథ్యంలో వలసదారుల సంఖ్యను తగ్గించేందుకు అనేక చర్యల్ని అధికారులు తీసుకుంటున్నారు. డెమోగ్రాఫిక్‌ బ్యాలన్స్‌ కోసం ఈ చర్యలు తీసుకోవలసి వస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com