వలసదారుల్లో ఇండియన్లే టాప్
- October 26, 2016
కువైట్: ఇంటీరియర్ మినిస్ట్రీకి చెందిన రెసిడెన్సీ ఎఫైర్స్ డిపార్ట్మెంట్ వెల్లడించిన వివరాల ప్రకారం రెసిడెన్సీ వీసాలు ఉన్న వలసదారుల సంఖ్య 2,670,000గానూ, అందులో 901,000 భారతీయ వలసదారులుగాను తేల్చింది. గడచిన ఆరు నెలల్లో 100,000 మంది భారతీయుల సంఖ్య పెరిగింది. ఆ తరువాతి స్థానంలో 587,700 సంఖ్యతో ఈజిప్టియన్లు ఉన్నారు. సిరియన్ల సంఖ్య 145,000గా ఉంది. బంగ్లాదేశీయుల సంఖ్య 202,000 (60,000 పెరుగుదల), 243,000 మంది ఫిలిప్పీన్స్, 39,000 ఇరానియన్స్, 60,00 నేపాలీస్ ఉన్నారు. ఏడు దేశాలకు చెందినవారి సంఖ్య మొత్తం విదేశీయుల్లో 90 శాతానికి పైగా ఉందని నివేదికలు చెబుతున్నాయి. కువైట్ జనాభాలో 2 / 3 వంతు విదేశీయులే ఉన్నారు. ఈ నేపథ్యంలో వలసదారుల సంఖ్యను తగ్గించేందుకు అనేక చర్యల్ని అధికారులు తీసుకుంటున్నారు. డెమోగ్రాఫిక్ బ్యాలన్స్ కోసం ఈ చర్యలు తీసుకోవలసి వస్తోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







