ఇంటర్నెట్ వ్యసనపరులకు 'ఎయిమ్స్ చికిత్స'
- October 26, 2016
ప్రస్తుతం మన జీవితాల్లో ఇంటర్నెట్ కలిసిపోయివున్న విషయం తెలిసిందే. సినిమా టికెట్ల బుకింగ్ నుంచి విమాన టికెట్ల వరకు అన్నింటికి ఇంటర్నెట్‌పైనే ఆధారపడుతున్నాం. ఇంటర్నెట్ వినియోగం ప్రపంచవ్యాప్తంగా అనేకమార్పులు తీసుకువచ్చింది. అయితే అదే సమయంలో ఇంట్లో కుటుంబసభ్యులు పక్కపక్కనే వున్నా అనుబంధాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఛాటింగ్, పోస్టింగ్, కామెంట్స్‌తోనే కాలం గడిపేస్తున్నాం. ఇంటర్నెట్ వీక్షణం ఒక వ్యసనంగా మారిపోవడంపై వైద్యనిపుణులు, సామాజిక శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ఇంటర్నెట్ డీ అడిక్షన్ క్లినిక్స్
ఈ నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలోని ఎయిమ్స్ తొలిసారిగా ఇంటర్నెట్ డీ అడిక్షన్ క్లినిక్‌ను ప్రారంభించింది. ఈ కేంద్రంలో శనివారం రోజున ఇంటెర్నెట్ వీక్షణం మానలేకుండా వున్న వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. రెండు సంవత్సరాల క్రితం పదోతరగతిలో టాపర్‌గా వున్న విద్యార్థి ఇంటర్నెట్ను అదేపనిగా బ్రౌజింగ్ చేయడం ప్రారంభించాడు. అనంతరం ఉన్నతతరగతుల్లో చదువులో ఏమాత్రం రాణించలేకపోయాడు. కారణం ఏకాగ్రత కుదరకపోవడమేనని అతని తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఇంటర్నెట్ వీక్షణను మాన్పించేందుకు అనేక రకాల చర్యలు తీసుకున్నా అవి విద్యార్థిలో ఎలాంటి మార్పులు తీసుకురాలేదు. దీంతో ఎయిమ్స్‌కు తీసుకువచ్చారు. కొద్దిరోజులకు ముందు ఇంట్లో ఇద్దరు సోదరులు ఇంటర్నెట్ను చూస్తుండగా కొందరు దొంగలు ప్రవేశించి ఇంట్లోని పలువస్తువులు ఎత్తుకువెళ్లారు. వారిని గమనించినా ఇంటర్నెట్ ముందు నుంచి లేవడం ఇష్టం లేక వారు దొంగలను తరిమేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదని సమాచారం. వీరిని కూడా ఈ కేంద్రానికి తీసుకువచ్చారు. చిన్న వయస్సులోనే పిల్లలకు స్మార్ట్ఫోన్లు ఇవ్వడం, విచ్చలవిడిగా ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్నా కట్టడిచేయకపోవడంతో పిల్లల్లో అనేక రుగ్మతలకు దారి తీస్తుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









