వెలుగులు విరజిమ్మే దీపావళిని జాగ్రత్తగా జరుపుకోవాలి: వెండితెర తారలు

- October 27, 2016 , by Maagulf
వెలుగులు విరజిమ్మే దీపావళిని జాగ్రత్తగా జరుపుకోవాలి:  వెండితెర తారలు

వెలుగు దివ్వెల దీపావళి పండుగ వచ్చేసింది. ప్రతి ఇంట్లో ప్రత్యేకంగా పూజలు నిర్వహించి, ఆ తర్వాత మతాబులు కాల్చుకోవడం రివాజు. సామాన్యల మాదిరిగానే వెండితెర తారలు సైతం సంబంరంగా ఈ వేడుక నిర్వహించుకుంటారు. నిత్యం షూటింగ్‌ బిజీలో ఉండే తారలు దీపావళి రోజు మాత్రం ఇంటికే పరిమితమై, కుటుంబసభ్యులతో కలిసి పండుగ జరుపుకుంటారు. టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌ తారలు అనేక మంది కొత్త బట్టలు ధరించి, ఇంటిని విద్యూద్దీపాలతో అలంకరిస్తారు. సన్నిహుతులు, బంధువులతో ఆనందంగా జరుపుకుంటారు. లక్ష్మీబాంబు, చిచ్చుబుడ్లు, కాకరపువ్వులు, భూ చక్రాలు, విష్ణు చక్రాలు, రాకెట్లు వెలిగిస్తారు. వెలుగులు విరజిమ్మే దీపావళిని జాగ్రత్తగా జరుపుకోవాలి, అజాగ్రత్త తగదని అభిమానులకు హితవు పలుకుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com