ఎయిర్పోర్ట్ కెపాసిటీ, ప్యాసింజర్ వాల్యూమ్ వ్యత్యాసం ఎక్కువే
- October 27, 2016
మస్కట్: ఎయిర్ పోర్ట్ కెపాసిటీ అలాగే ప్యాసింజర్ వాల్యూమ్స్ మస్కట్‌లో చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. మస్కట్తోపాటు కువైట్, అబుదాబీ, సౌదీ అరేబియా, అలాగే ఇరాన్‌లోనూ ఇది బలంగా ఉంది. మిడిల్ ఈస్ట్ రీజియన్‌లో ఎయిర్పోర్ట్ కెపాసిటీతో పోల్చితే ఎయిర్పోర్ట్ ప్యాసింజర్ వాల్యూమ్స్ 11 శాతం పెరుగుదల కనిపించింది. ఈ నేపథ్యంలో కొత్తగా ఎయిర్‌పోర్టుల అభివృద్ధి, విస్తరణ వంటివి తప్పనిసరిగా మారాయి. ఈ రంగంలో పెద్దయెత్తున పెట్టుబడులు కూడా ఆశాజనంగా కనిపిస్తున్నాయి. దుబాయ్ ఎక్స్పో 2020, 2022 ఫిఫా వరల్డ్ కప్ ఖతార్ కూడా ఈ రీజియన్‌లో ట్రావెల్ అండ్ టూరిజం అవకాశాలు పెరగనున్నట్లు అంచనా వేస్తున్నారు. మిడిల్ ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్‌లో 1300 ఎయిర్‌క్రాఫ్ట్‌లకు ఆర్డర్ పెండింగ్‌లో ఉంది. వీటి విలువ 345 బిలియన్ డాలర్స్‌గా ఉంది. 100 బిలియన్ డాలర్లకు పైగా ఎయిర్పోర్ట్ ప్రాజెక్టులు నిర్మాణంలోనూ, ప్లానింగ్‌లోనూ ఉన్నాయి ఈ రీజియన్‌లో. అదనంగా ఏడాదికి 400 మిలియన్ ప్రయాణీకుల్ని రానున్న 10 నుంచి 20 ఏళ్ళలో ఈ రీజియన్ ఆకర్షించనుంది. కొత్త ఎయిర్‌పోర్టులు, అలాగే ఉన్న ఎయిర్‌పోర్ట్‌ల విస్తరన వంటివి 2020లోపల జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు
తాజా వార్తలు
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి
- భారత్‌కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్‌లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్‌సన్‌ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..









