ఖత్ రవాణా చేసే ముగ్గురు స్మగ్లర్లు అరెస్ట్
- October 27, 2016
మస్కట్ : ఖత్ మాదకద్రవ్యంను ముగ్గురు అక్రమ రవాణాదారులు పంపిణీ చేసే యత్నంలో వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని పోలీసులు ఆపడంతో వారి దుర్మార్గం బట్టబయలైంది. శలాలః ఒక స్మగ్లింగ్ స్థానానికి చేరుస్తున్న వారి ప్రయత్నం రాయల్ ఒమన్ పోలీసులు అడ్డుకొన్నారు. అదే విధంగా ఒమాన్ లో అక్రమ మద్యం అమ్మకాలు మరియు మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న ప్రవాసీయులను అరెస్టు చేశారు
రాయల్ పోలీస్ ఒక ఉన్నతాధికారి తెలిపిన వివరాల ప్రకారం నార్కోటిక్స్ కంట్రోల్ జట్టులో ధోఫర్ తీరం గార్డ్లు సహకారంతో,ఖత్ యొక్క 2665 కట్టలను అక్రమంగా సుల్తానేట్ లోకి వారు తీసుకువచ్చే ప్రయత్నం అడ్డుకున్నట్లు ఆయన తెలిపారు. ఆ ముగ్గురు స్మగ్లర్లు పడవలు ద్వారా సైకోట్రోపిక్ మూలికలు ఆక్రమ రవాణా నేరుగా తరలించే యత్నం సైతం వారు చేసినట్లు పేర్కొన్నారు. వీరి నేరంపై పరిశోధనల ఇప్పటికీ జరుగుతున్నాయని ఆ అధికారి తెలిపారు.
తాజా వార్తలు
- ఆస్కార్ రేసులో సౌదీ 'హిజ్రా' సినిమా..!!
- ఒమన్ లో పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సాహం..!!
- యూఏఈ వెదర్ అలెర్ట్.. భారీ వర్షాలు..వరదలు..!!
- ఖతార్ లో 'టాన్నౌరిన్' బాటిల్ వాటర్ ఉపసంహరణ..!!
- బహ్రెయిన్ లో జోరుగా నేషనల్ ట్రీ వీక్..!!
- పబ్లిక్ ప్లేస్ లో న్యూసెన్స్..పలువురు అరెస్టు..!!
- ప్రధాని మోదీ సభ పై కూటమి ఫోకస్
- Wi-Fi 8 పరిచయం
- ఘరఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ అండర్పాస్ మూసివేత..!!
- మాదకద్రవ్యాలను కలిగి ఉన్న పది మంది అరెస్టు..!!