నిరసనకారుడి జైలు శిక్ష తగ్గింపు
- October 27, 2016
మనామా: స్థానిక పొలిటికల్ సొసైటీ జనరల్ సెక్రెటరీ, యెమెన్‌లో సౌదీ నేతృత్వంలో జరుగుతున్న ఆపరేషన్‌పై అసత్యాలు ప్రచారం చేసిన కేసులో ఐదేళ్ళ శిక్షను ఎదుర్కొంటుడగా, అతని శిక్షను మూడేళ్ళకు సుప్రీం అపీల్స్ కోర్ట్ తగ్గించింది. మార్చ్ 2015లో సౌదీ నేతృత్వంలో పలు దేశాలు యెమెన్‌లోని హుతి రెబల్స్‌పై ఎయిర్ స్ట్రైక్స్ ప్రారంబించింది. యెమెన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రవాదులు సృష్టిస్తున్న మారణహోమాన్ని నిలువరించేందుకు ఈ దాడులు జరుగుతున్నాయి. అయితే ఈ దాడులపై అసత్య కథనాల్ని నేషనల్ డెమొక్రటిక్ అసెంబ్లీ (అల్ వదావి) జనరల్ సెక్రెటరీ ఫదెల్ అబ్బాస్ ప్రచారం చేశారు సోషల్ మీడియా ద్వారా. అయితే తన క్లయింట్ ఎలాంటి చట్టాల్నీ అతిక్రమించలేదంటూ అబ్బాస్ తరఫు లాయర్ న్యాయస్థానంలో వాదనలు వినిపించారు. అబ్బాస్‌కి డిప్యూటీ అయిన మొహమ్మద్ అల్ మొతావాపైనా విచారణ కొనసాగుతోంది ఇదే కేసులో. మిలిటరీ ఆపరేషన్స్‌ని కించపర్చేలా అసత్య ప్రచారం చేసినందుకుగాను ఆయనపైనా కేసులు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







