దీపావళి బోనస్‌గా.. 1,260 కార్లు, 400 ఫ్లాట్లు. ఉద్యోగులకు వరాల జల్లు
- October 28, 2016
దీపావళి పండుగకు భారతదేశంలో కొన్ని ప్రముఖ కంపెనీలు స్వీట్ పాకెట్ తో ఉద్యోగులను సంతృప్తి పరుస్తాయి. మరికొన్ని సంస్థలు పండుగ చీకటిపడిన తర్వాత కదా ...పగలు పని చేయండని కఠినంగా హుకుం జారీ చేస్తారు ...కానీ , భారతదేశంలోనే బిన్నంగా గుజరాత్‌లోని ఓ వ్యాపార దిగ్గజం.. దీపావళికి తమ ఉద్యోగస్తులకు కళ్లు చెదిరే బోనస్ పాయింట్లు అందచేశారు గుజరాత్ సూరత్‌లోని వజ్రాల వ్యాపారి, కోటీశ్వరుడు సావ్జీ ఢోలకియా ఈ దీపావళికి ఉద్యోగులకు భారీ కానులకిచ్చి.. తన ఉదారతతో తనకు సాటి అయిన వారు లేరని మరోసారి చాటిచెప్పారు. ప్రతి ఏటా ఉత్తమ సేవలు అందించే ఉద్యోగులకు పెద్ద ఎత్తున బహుమానాలు ఇస్తూ ప్రత్యేకత చాటుకునే ఢోలకియా.. తన ఉద్యోగులకు దీపావళి బోనస్‌గా 1,260 కార్లు, 400 ఫ్లాట్లు బహుమతులుగా ప్రకటించింది.
కంపెనీ స్వర్ణోత్సవాల్ని పురస్కరించుకుని ఈ ఏడాది బోనస్ కోసం రూ.51 కోట్లు వెచ్చిస్తోంది. కంపెనీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగుల జాబితాలో 1,716 మంది ఉన్నారు. బోనస్ వివరాల్ని మంగళవారం ఉద్యోగులతో నిర్వహించిన అనధికార సమావేశంలో ప్రకటించారు. గతంలో బోనస్ కోసమే రూ.50కోట్లు వెచ్చించినట్లు హరేకృష్ణ ఎక్స్పోర్ట్ ఢోలకియా వెల్లడించారు. ఉద్యోగులను సంతోషపరిచేందుకు వారిని తృప్తి పరిచేందుకు ఢోలకియా ఇలాంటి బహుమతులను అందిస్తోంది. 75 దేశాలలో ప్రముఖ పాలిష్ కంపెనీలు ఒకటిగా ఈ సంస్థ భారతదేశం డైమండ్ కేంద్రంగా సూరత్ నుంచి వజ్రాలు ఎగుమతులు చేస్తుంది.
తాజా వార్తలు
- కువైట్‌లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్‌కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్‌లో ఉద్యోగాలు..









