కాబూలీ శనగల అరటి పువ్వు కూర
- October 30, 2016కావలసిన పదార్థాలు: కాబూలీ శనగలు - గుప్పెడు, (శుభ్రం చేసిన) అరటిపువ్వు - 1 కప్పు, పసుపు - అర టీ స్పూను, పచ్చిమిర్చి - 1, కరివేపాకు - 4 రెబ్బలు, ఉల్లి తరుగు - అర కప్పు, గరం మసాల, దనియాల పొడి, జీలకర్ర - అర టీ స్పూను చొప్పున, కొత్తిమీర - అరకప్పు, పచ్చికొబ్బరి తురుము - గుప్పెడు, ఉప్పు - రుచికి తగినంత.
తయారుచేసే విధానం: అరటిపువ్వు, శనగలు కలిపి ఒక రాత్రంతా నానబెట్టాలి. తర్వాత నీరు వడకట్టి, తాజా నీరు, కొద్ది ఉప్పుతో ఒక విజిల్ వచ్చేవరకు ఉడికించాలి. నూనెలో జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లి తరుగు, కరివేపాకు వేగించాలి. తర్వాత ఉప్పు, దనియా, గరం మసాల పొళ్లు వేసి, ఉడికించిన శనగలు, అరటి పువ్వు కలపాలి. 5 నిమిషాలు చిన్నమంటపై ఉంచి కొత్తిమీర, కొబ్బరి తురుము కలిపి దించేయాలి. ఈ కూర చపాతీల్లోకి, పాటు అన్నంలోకి కూడా బాగుంటుంది.
తాజా వార్తలు
- ఇక డ్రైవింగ్ టెస్ట్ కోసం RTO ఆఫీస్ వెళ్లాల్సిన అవసరం లేదు..
- హైదరాబాద్ పై కోల్కతా విజయం
- తెలంగాణలోని 10 వర్సిటీలకు ఇన్ఛార్జి వీసీల నియామకం
- సింగపూర్ విమానంలో భారీ కుదుపులు...ఒకరి మృతి
- అమెరికా కోర్టు న్యాయమూర్తిగా తెలుగు మహిళ జయ బాడిగ
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి..భారత్ సంతాపం
- ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- జూన్ 1 నుండి సింగిల్ యూజ్ స్టైరోఫోమ్ ఉత్పత్తుల బ్యాన్
- ప్రస్తుత ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టనున్న DXB..!
- నకిలీ వెబ్సైట్ల గురించి పోలీసుల హెచ్చరిక