బహ్రెయిన్‌ ఎకానమీకి 'ఫ్లెక్సిబుల్‌ వర్క్‌ పర్మిట్స్‌' ఊతం

- October 30, 2016 , by Maagulf
బహ్రెయిన్‌ ఎకానమీకి 'ఫ్లెక్సిబుల్‌ వర్క్‌ పర్మిట్స్‌' ఊతం

బహ్రెయిన్‌ ఆర్థిక వ్యవస్థకు 'ఫ్లెక్సిబుల్‌ వర్క్‌ పర్మిట్స్‌' ఊతమిస్తాయని ఆర్థిక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. లేబర్‌ మార్కెట్‌ రెగ్యులేటరీ అథారిటీ (ఎల్‌ఎమ్‌ఆర్‌ఎ) సిఇఓ ఔస్మా అల్‌ అబ్సి మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. టెంపరరీ ఎంప్లాయ్‌మెంట్‌ విధానం ద్వారా ఉద్యోగులకు అలాగే, సంస్థలకు ఎంతో మేలు కలుగుతుందని ఆయన చెప్పారు. లేబర్‌ మార్కెట్‌లో మార్పులకు, సవాళ్ళకు బహ్రెయిన్‌ సిద్ధంగా ఉందని, బహ్రెయిన్‌ ఎకానమీ ఈ తాజా విధానంతో పరుగులు పెట్టడం ఖాయమని ఆయన అభిప్రాయపడ్డారు. అల్‌ అబ్సి ఇంకా మాట్లాడుతూ, కార్మికులే స్పాన్సర్‌షిప్‌, ఎంప్లాయ్‌మెంట్‌, హెల్త్‌కేర్‌ మరియు ఇన్సూరెన్స్‌ పీజు చెల్లించుకోవాలనీ, అదే సమయంలో ఒకేసారి మల్టిపుల్‌ ఎంప్లాయర్స్‌తో పనిచేయవచ్చని వివరించారు. 200 బహ్రెయినీ దినార్లు ఇస్యూయెన్స్‌ ఫీజును, హెల్త్‌ కేర్‌ ఫీజు 144 బహ్రెయిన్‌ దినార్స్‌నీ, నెలవారీ సోషల్‌ ఇన్స్యూరెన్స్‌ 30 బహ్రెయినీ దినార్స్‌నీ తామంతట తామే భరించాల్సి ఉంటుందని తెలిపారాయన. ప్రతి నెల 2,000 మందికి ఈ పర్మిట్స్‌ ఇవ్వాలని అధికారిక వర్గాలు భావిస్తున్నాయి. కొత్త పర్మిట్స్‌ విధి విధానాలపై అవేర్‌నెస్‌ ప్రోగ్రామ్‌ నిర్వహించాలనుకుంటున్నట్లు అల్‌ అబ్సి చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com