ఒబామా తొలిసారి తన అధికారిక కార్యాలయంలో దీపావళి వేడుకలు

- October 30, 2016 , by Maagulf
ఒబామా తొలిసారి తన అధికారిక కార్యాలయంలో దీపావళి వేడుకలు

అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా తొలిసారి తన అధికారిక కార్యాలయంలో దీపావళి వేడుకలు జరుపుకొన్నారు. తన తర్వాత వచ్చిన అధ్యక్షులు కూడా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఒబామా మాట్లాడుతూ '2009లో నేను , మిచెల్‌ దీపావళీ జరుపుకొన్నప్పుడు భారతీయులు సంతోషించారు. మేము ముంబయి వెళ్లినప్పుడు మమ్మల్ని ఎంతో గౌరవంగా ఆహ్వనించారు. ఆ అనుభవాన్ని మర్చిపోలేను. దీపావళి సందర్భంగా ఈ సారి నా కార్యాలయంలో మొట్టమొదటి దీపం వెలిగించిన అనుభవం మర్చిపోలేను. దీనిని చూస్తే చీకటి తర్వాత వెలుగు వస్తుందని మనకు అర్థమవుతుంది. ఈ సంప్రదాయాన్ని భవిష్యత్తులో వచ్చే అధ్యక్షులు కూడా పాటిస్తారని భావిస్తున్నాను.మీరు, మీకు ఇష్టమైనవారు ఈ దీపావళికి సుఖసంతోషాలతో ఉండాలని ఒబామా కుటుంబం తరపున కోరుకుంటున్నాను' అని ఒబామా అన్నారు. ఈ విషయాన్ని వైట్‌హౌస్‌ ఫేస్‌బుక్‌ పేజీలో పోస్టు చేసిన వెంటనే 1.5లక్షల లైకులు, 33,000 షేర్లు వచ్చాయి.క్లింటన్‌ శుభాకాంక్షలు దీపావళి సందర్భంగా హిందు, సిక్కు, జైన్‌, బౌద్ధులకు డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా క్లింటన్‌ మాట్లాడుతూ.. 'ప్రపంచ వ్యాప్తంగా వందకోట్ల మంది హిందు, సిక్కు, బౌద్ధ, జైనులు, రెండు కోట్ల మంది అమెరికన్లు ఈ దీపావళిని ఘనంగా జరుపుకొంటారు. దీపం చెడుపై విజయానికి చిహ్నంగా నిలుస్తుంది' అని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com