8 మంది సిమి ఉగ్రవాదులు పోలీసుల కాల్పుల్లో మరణించారు...
- October 31, 2016
భోపాల్ జైలు నుంచి పరారైన 8మంది సిమి ఉగ్రవాదులు పోలీసుల కాల్పుల్లో మరణించారు. భోపాల్‌లోని ఓ శివారు గ్రామంలో వీళ్లంతా ఓ ఇంట్లోని వున్నట్లు సమాచారం రావడంతో రంగంలోకి దిగింది యాంటీ టెర్రరిస్ట్ స్క్యాడ్. దీంతో ఇటు సిమీ- అటు పోలీసుల మధ్య హోరాహోరీగా కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 8 మంది సిమి ఉగ్రవాదులు హతమయ్యారు.దీపావళి సంబరాలు జరుగుతున్నప్పుడు అందరూ ఏమరుపాటుగా ఉంటారని ముందే గ్రహించి పక్కాగా తమ ప్లాన్ అమలు చేశారు సిమి. ఆదివారం రాత్రి ఓ గార్డును చంపి జైలు నుంచి పారిపోయారు. రాత్రి 2 గంటల ప్రాంతంలో వీళ్ళు కత్తితో హెడ్ కానిస్టేబుల్ రామశంకర్ గొంతు కోసి జైలు గోడ దూకి పరారయ్యారు. ఈ ఘటనకు సంబందించి అయిదుగురు జైలు అధికారులను సస్పెండ్ చేశారు.ఇదిలావుండగా వెంటనే అప్రమత్తమైన పోలీసులు, భోపాల్‌కి వచ్చి, వెళ్లేదారులపై కన్నేసి తనిఖీలు చేపట్టారు. మూడేళ్ళ క్రితం కూడా ఇక్కడికి సుమారు 280 కి.మీ. దూరంలోని ఖాండ్వా లో ఇదే తరహాలో ఏడుగురు సిమి టెర్రరిస్టులు బాత్ రూమ్ గోడ ధ్వంసం చేసి పారిపోయారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







